• By Admin
  • 08 Dec 2025

Sai Vidya Mandir students visited Sri Punyalingeswara Swamy Temple

The Sri Punyalingeswara Swamy Kshetra is located in Choutuppal village, Yadadri Bhuvanagiri district, Telangana state. Here, the Supreme Lord is worshipped as Sri Punyalingeswara, in the form of a lingam. Shivayya shines as the Lord who bestows merit on devotees, as the goldsmith who fulfills desires, and as Punyalingeswara. Shiva devotees and founder of the Kshetra, Sri Shankar Guruji, started the construction of the temple with the blessings of Shiva. It is a special feature that devotees are also a part of this meritorious work.

Along with the main temple, there are also Sri Ganapati and Sri Manikyamba Devi sub-temple. The temple impresses with its five-storey eastern Rajagopuram, three-storey western, northern and southern Galigopurams, magnificent flag pole, altar, Maha Mandapam, high temple walls, and captivating sculpture wealth. Devotees can also visit the temples of Sri Kumaraswamy, Kshetrapalaku Kalabhairavaswamy and Navagraha.

Krishna stone was brought from Mahabalipuram for the construction of the temple. The temple is being built by craftsmen from Tamil Nadu. The 12 Jyotirlingas, Somnath, Mallikarjuna Swamy, Mahakaleshwar, Omkareshwar, Vaidyanath, Bhimashankar, Rameshwar, Kashi Vishwanath, Trimbakeshwar, Nageshwar, Kethareshwar and Ghrishneswar, which are unique in the country, have been located here. Devotees who cannot travel thousands of kilometers to visit them can visit all 12 Jyotirlingas at one place.

తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరిజిల్లా, చౌటుప్పల్ గ్రామంలో ఉంది శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి క్షేత్రం. ఇక్కడ పరమేశ్వరుడు శ్రీ పుణ్యలింగేశ్వరుడిగా, లింగాకారంలో పూజలందుకుంటున్నాడు. భక్తులకు పుణ్యం ప్రసాదించే స్వామిగా, కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా, పుణ్యలింగేశ్వర నామాంకితుడై శివయ్య వెలుగొందుతున్నాడు. శివోపాసకులు, క్షేత్ర వ్యవస్థాపకులు శ్రీశంకర్ గురూజీ శివానుగ్రహంతో ఆలయ నిర్మాణానికి నడుం బిగించారు. భక్తులు కూడా ఈ పుణ్యకార్యంలో భాగం కావడం విశేషం.

ప్రధాన ఆలయంతో పాటూ శ్రీగణపతి, శ్రీ మాణిక్యాంబ దేవి ఉపాలయాలు. ఐదంతస్తుల తూర్పు రాజగోపురం, మూడంతస్తుల పడమర,ఉత్తర, దక్షిణ గాలిగోపురాలు, అద్భుతమైన ధ్వజస్థంభం, బలిపీఠం,మహా మండపం,ఎత్తైన ఆలయ ప్రాకారాలు, కట్టిపడేసే శిల్పకళా సంపదతో ఆలయం ఆకట్టుకుంటుంది. అలాగే శ్రీ కుమారస్వామి, క్షేత్ర పాలకుడు కాలభైరవస్వామి, నవగ్రహ ఆలయాలను కూడా భక్తులు దర్శించుకోవచ్చు.

ఆలయ కట్డడం కోసం మహాబలిపురం నుంచి కృష్ణశిలను తీసుకురావడం జరిగింది. తమిళనాడుకు చెందిన శిల్పకారులచే ఆలయం నిర్మాణం జరుగుతుంది.దేశంలో ఎక్కడాలేని విధంగా 12 జ్యోతిర్లింగాలైన సోమనాథ్, మల్లికార్జున స్వామి, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, వైద్యనాథ్, భీమశంకర్, రామేశ్వర్, కాశీ విశ్వనాథ్, త్రయంబకేశ్వర్, నాగేశ్వర్, కేథారేశ్వర్, ఘృష్ణేశ్వర్ ఆలయాలు ఇక్కడ కొలువయ్యాయి. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి దర్శించుకోలేని భక్తులు ఒకేచోట 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు.

श्री पुण्यलिंगेश्वर स्वामी क्षेत्र, तेलंगाना राज्य के यदाद्री भुवनगिरी ज़िले के चौटुप्पल गाँव में है। यहाँ, भगवान की पूजा श्री पुण्यलिंगेश्वर के रूप में, लिंगम के रूप में की जाती है। शिवय्या भक्तों को पुण्य देने वाले भगवान, इच्छाएँ पूरी करने वाले सुनार और पुण्यलिंगेश्वर के रूप में चमकते हैं। शिव भक्तों और क्षेत्र के संस्थापक, श्री शंकर गुरुजी ने शिव के आशीर्वाद से मंदिर का निर्माण शुरू किया। यह एक खास बात है कि भक्त भी इस पुण्य कार्य का हिस्सा हैं।

मुख्य मंदिर के साथ, श्री गणपति और श्री मणिक्यम्बा देवी उप-मंदिर भी हैं। मंदिर अपने पाँच मंज़िला पूर्वी राजगोपुरम, तीन मंज़िला पश्चिमी, उत्तरी और दक्षिणी गैलिगोपुरम, शानदार झंडे का खंभा, वेदी, महा मंडपम, ऊँची मंदिर की दीवारों और मनमोहक मूर्तियों से प्रभावित करता है। भक्त श्री कुमारस्वामी, क्षेत्रपालकु कालभैरवस्वामी और नवग्रह मंदिरों में भी जा सकते हैं।

मंदिर बनाने के लिए महाबलीपुरम से कृष्ण पत्थर लाया गया था। मंदिर तमिलनाडु के कारीगर बना रहे हैं। देश में अनोखे 12 ज्योतिर्लिंग, सोमनाथ, मल्लिकार्जुन स्वामी, महाकालेश्वर, ओंकारेश्वर, वैद्यनाथ, भीमाशंकर, रामेश्वर, काशी विश्वनाथ, त्र्यंबकेश्वर, नागेश्वर, केथरेश्वर और घृष्णेश्वर, यहीं हैं। जो भक्त हज़ारों किलोमीटर दूर जाकर दर्शन नहीं कर सकते, वे एक ही जगह पर सभी 12 ज्योतिर्लिंगों के दर्शन कर सकते हैं।